ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఈ సినిమా కోసం లోకేష్ చెప్పిన ఫైనల్ డ్రాఫ్ట్ అల్లు అర్జున్‌కు నచ్చకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టేశారనే ప్రచారం ముమ్మరంగా సాగింది.
అటు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఈ పుకార్లు చూసి అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ తాజాగా, ఈ రూమర్లపై అల్లు అర్జున్ పిఆర్ టీమ్ స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ రద్దయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తి అబద్ధాలని టీమ్ కొట్టిపారేసింది.
దీంతో బన్నీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అట్లీ దర్శకత్వంలో చేస్తున్న ‘రాకా’ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత, లోకేష్ కనగరాజ్ సినిమా పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించనున్నాడు.


