గుంటూరులో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘అజ్ఞాతవాసి’ !

ముందు నుండి అనుకున్నట్టే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ హౌస్ ఫుల్ రన్ తో నడిచిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు సంతృప్తి కలిగించేలా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మెన్స్ చూపించింది.

ముఖ్యంగా రూ.9 కోట్ల భారీ మొత్తానికి హక్కులు అమ్ముడైన గుంటూరు జిల్లా ఏరియాలో మొదటి రోజు రూ3.78 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇది చాలా మంచి రికవరీ. పండుగ మూడు రోజులు రన్ ఇలాగే కొనసాగితే చిత్రం పెట్టిన మొత్తాన్ని రాబట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక మిగతా ఏరియాల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.