నార్త్ ఆడియెన్స్ కి పూనకాలు ఇవ్వడానికి రెడీ అవుతున్న “అఖండ” ప్రీమియర్.!

నార్త్ ఆడియెన్స్ కి పూనకాలు ఇవ్వడానికి రెడీ అవుతున్న “అఖండ” ప్రీమియర్.!

Published on Mar 6, 2024 7:08 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన లాస్ట్ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్స్ కాగా ఈ చిత్రాల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తో చేసిన సెన్సేషనల్ కం బ్యాక్ హిట్ చిత్రం “అఖండ” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో పోటెన్షియల్ ఒక్క తెలుగు ఆడియెన్స్ కి మాత్రమే కాదు నార్త్ ఆడియెన్స్ కి కూడా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది అని అంతా భావించారు. అయితే హిందీలో అఖండ హాట్ స్టార్ లో ప్రీమియర్ కి రాగా మంచి రెస్పాన్స్ అప్పుడు వచ్చింది.

అయితే మరి ఫైనల్ గా ఇప్పుడు ఫ్రీ గా అఖండ హిందీ ఆడియెన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ వారు అయితే అఖండ హిందీ వెర్షన్ ని అఫీషియల్ గా ఈ మహాశివరాత్రి కానుకగా యూట్యూబ్ లో తమ యూట్యూబ్ ఛానెల్ లో ప్రీమియర్ గా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. మరి ఈ సినిమాకి మాత్రం యూట్యూబ్ లో రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వస్తుందేమో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు