“అఖండ” మాస్ జాతర 45వ రోజు కూడా హౌస్ ఫుల్స్.!

Published on Jan 16, 2022 9:59 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “అఖండ” ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో చూసాము. బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా ఈ హ్యాట్రిక్ కాంబోపై ఉన్న అంచనాలను మించి సెన్సేషనల్ హిట్ అయ్యింది.

మరి గత డిసెంబర్ 2న రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగు స్టేట్స్ సహా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు అందుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్కడ నుంచి అఖండ మాస్ జాతరగా పిలవబడ్డ ఈ చిత్ర విజయం ఇప్పుడు 45వ రోజుకి చేరుకున్నా అదే విధంగా కొనసాగడం విశేషం. మరి ఈ సంక్రాంతి కి కూడా అఖండ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం అఖండ మ్యానియా మామూలుగా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :