“అఖండ” నుంచి “అమ్మ” ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..!

Published on Jan 17, 2022 11:31 pm IST

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు ఫుల్ వీడియో సాంగ్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాలో “అమ్మ” అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా, “బుల్లెట్ బండి” ఒరిజినల్ పాట పాడిన మోహన భోగరాజు ఈ పాటను పాడింది. తమన్ ఈ పాటకు సంగీతాన్ని అందించాడు.

వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :