ఆకట్టుకుంటున్న ‘ఏజెంట్’ నుండి ‘మళ్ళి మళ్ళి’ సాంగ్ ప్రోమో

Published on Feb 22, 2023 12:00 am IST


అక్కినేని అఖిల్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. అఖిల్ ఈ మూవీలో రా ఏజెంట్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా, విక్రమ్ జీత్ విర్క్ నటిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి నేడు హిప్ హాఫ్ తమిళ కంపోజ్ చేసిన మళ్ళి మళ్ళి అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసారు మేకర్స్. హిప్ హాఫ్ తమిళ పాడిన ఈ సాంగ్ ని ఆదిత్య అయ్యంగార్ రచించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో యువతని ఎంతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా దీని ఫుల్ సాంగ్ ని రేపు రాత్రి 7 గం. 3 ని. లకు రిలీజ్ చేయనున్నారు. కాగా ఏజెంట్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :