హాఫ్ మిలియన్ అందుకున్న అఖిల్ !

‘హలో’ చిత్రానికి వస్తున్న స్పందనకు హీరో అఖిల్ ఎంతగానో సంతోషపడుతున్నారు. చిత్రానికి మొదటిరోజు నుండే పాజిటివ్ మౌత్ టాక్ ఏర్పడటం, అన్ని చోట్ల కలెక్షన్లు బాగుండటంతో రీ-లాంచ్ విజయవంతమైనట్టే భావిస్తున్నారంతా. ముఖ్యంగా ఓవర్సీస్లో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. మొదటి నుండి అక్కడి వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన అఖిల్ ప్రత్యేకంగా యూఎస్ వెళ్లి మరీ ప్రేక్షకుల్ని కలిశారు.

దీంతో పీమియర్లు, శుక్రవారం కలెక్షన్లు కలుపుకుని చిత్రం 3.64 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది. ఇక శనివారం 1.4 లక్షల డాలర్లను రాబట్టి రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది. దీంతో ఇంతలా సపోర్ట్ చేసిన అక్కడి ప్రేక్షకులకు అఖిల్ తన టీమ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీకెండ్ కావడం, క్రిస్టమస్ సెలవులు కావడం వసూళ్లకు మరింతగా కలిసిరానుంది.