ఇంకొద్దిసేపట్లో మొదలుకానున్న ‘హలో’ హంగామా !
Published on Dec 1, 2017 7:00 am IST

అక్కినేని అఖిల్ రెండవ చిత్రం ‘హలో’ చివరి దశ పనుల్లో ఉంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో టీమ్ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. చిత్ర టీజర్ మంచి ఆసక్తిని రేకెత్తించడంతో ట్రైలర్ పై భారీ అంచనాల్ని పెట్టుకున్నారు అభిమానులు.

వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉంటుందని చెబుతున్నారు టీమ్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కావడం, నాగార్జున దగ్గరుండి అన్ని జాగర్తలు తీసుకుని సినిమాని నిర్మిస్తుంటడంతో సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు అభిమానులు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 
Like us on Facebook