కన్ఫర్మ్: నార్త్ లో మరోసారి “RRR” రోర్..

కన్ఫర్మ్: నార్త్ లో మరోసారి “RRR” రోర్..

Published on May 5, 2024 9:51 AM IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) లు హీరోలుగా ఆలియా భట్ (Alia Bhatt), ఒలీవియా మోరిస్ లు హీరోయిన్ గా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం భారతదేశానికి తెలుగు సినిమాకి ఆస్కార్ ని కూడా తీసుకువచ్చింది.

ఇలా ఎన్నో నెలల పాటుగా ప్రపంచ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా నిలిచిన ఈ చిత్రం నార్త్ బెల్ట్ లో కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు నార్త్ బెల్ట్ లో రీ రిలీజ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఇండియా అంతా కూడా సరైన సినిమాలు రిలీజ్ లు లేక రీ రిలీజ్ లే ఎక్కువ వస్తున్నా సంగతి చూస్తున్నాం.

అలా తాజాగా నార్త్ లో RRR ని డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్ స్టూడియోస్ వారు ఈ సినిమా రీ రిలీజ్ ని కన్ఫర్మ్ చేస్తూ హింట్ ఇచ్చారు. గత కొన్ని రోజులు కితం నుంచి కూడా ఇస్తున్నారు. దీనితో ఈ భారీ సినిమా మరోసారి నార్త్ ఆడియెన్స్ ని పలకరించేందుకు రాబోతుంది అని చెప్పాలి. అయితే దీనికి ఇంకా రిలీజ్ డేట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు