‘2.0’కి అక్షయ్ కుమారే హీరో : రజనీ

rajni
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘రోబో’ 2010లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో 2.0 అనే సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పట్నుంచే తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఇక నిన్న సాయంత్రం ముంబైలో భారీ ఎత్తున నిర్వహించిన ఒక ఈవెంట్‌లో విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.

ఈ ఫస్ట్‌లుక్ లాంచ్ వేడుకలో మాట్లాడుతూ రజనీకాంత్, 2.0లో విలన్‌గా నటించిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 2.0లో అక్షయ్ కుమార్ రోల్ అద్భుతంగా ఉంటుందని, ఆ పాత్రకు జీవం పోసేందుకు అక్షయ్ చాలా కష్టపడ్డాడని, తననడిగితే ఈ సినిమాకు అక్షయ్ కుమార్‌నే అసలైన హీరోగా చెబుతానని రజనీ అన్నారు. ఛాన్స్ దొరికితే ఆ పాత్ర తానే చేయాలనుకున్నట్లు రజనీ ఈ సందర్భంగా తెలిపారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.