ఈ నెల 24న జీ5 లోకి “అలాంటి సిత్రాలు”..!

Published on Sep 14, 2021 2:16 am IST


శ్వేతా పరాశర్, యాష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన “అలాంటి సిత్రాలు” సినిమా ఈ నెల 24న జీ 5లో స్ట్రీమింగ్ కాబోతుంది. పూరి జగన్నాధ్ వద్ద రచన విభాగంలో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శాటిలైట్ మరియు డిజిటల్ కన్సల్టెంట్ కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రాహుల్ రెడ్డి నిర్మించారు.

అయితే విభిన్న జీవితాలను గడిపే నలుగురు భిన్న వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు ఎదురుపడినప్పుడు వారి వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు సుప్రీత్ సి. కృష్ణ చెప్పుకొచ్చాడు. కొత్త కథనం, సరికొత్త పాత్రలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :