లేటెస్ట్ : అందరి చూపు ‘ప్రాజెక్ట్ కె’ వైపు

లేటెస్ట్ : అందరి చూపు ‘ప్రాజెక్ట్ కె’ వైపు

Published on Oct 23, 2022 2:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా హై బడ్జెట్, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న మూవీ ప్రాజెక్ట్ కె. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చేస్తుండగా బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రాజక్ట్ కె పై మొదటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

అయితే విషయం ఏమిటంటే, నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి ఒక్క చిన్న అప్ డేట్ ఇస్తున్నట్లు నిన్న ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా డైరెక్టర్ నాగ అశ్విన్ సమాధానం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూవీస్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ప్రాజక్ట్ కె నుండి ఇవాళ ఎటువంటి అప్ డేట్ వస్తుందో ఏమో అంటూ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటలు ఆగితే గాని దీని పై సస్పెన్స్ వీడదు. కాగా ఈ మూవీని ప్రస్తుతం శరవేగంగా షూట్ చేస్తున్న యూనిట్, 2024 ప్రథమార్ధం లో దీనిని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు