మార్చి మొదటి వారం నుండి అల్లరి నరేష్ కొత్త సినిమా !
Published on Feb 26, 2018 4:34 pm IST

వరుస పరాజయాలతో డీల్ పడిన అల్లరి నరేష్ తన తర్వాతి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో తనకు ‘సుడిగాడు’ వంటి విజయాన్ని అందించిన భీమినేని శ్రీనివాసరావుతో ఒక సినిమా చేస్తున్న నరేష్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో ఒక చిత్రాన్ని చేయనున్నాడు.

ఈ చిత్రాన్ని 2016లో ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ప్రసంశలు అందుకున్న పివి.గిరి డైరెక్ట్ చేయనున్నారు. మార్చి మొదటి వారంలో ఈ చిత్ర, యొక్క రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి .

 
Like us on Facebook