శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ తెలంగాణవ్యాప్తంగా థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా నైట్ షోల విషయానికి వస్తే ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లోని థియేటర్లలో బుకింగ్స్ జోరుగా సాగుతుండగా, పలు స్క్రీన్లలో ఫాస్ట్ ఫిల్లింగ్, హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్క్రీన్లలో నైట్ షోలకు మంచి ఆక్యుపెన్సీ నమోదవుతోంది. కూకట్‌పల్లి భ్రమరాంబ 70ఎంఎం, ప్రసాద్స్ మల్టీప్లెక్స్, అమీర్‌పేట్ ఏఏఏ సినిమాస్, పీవీఆర్ నెక్సస్ మాల్, చందానగర్ జేపీ సినిమాస్, మూసాపేట్ శ్రీరాములు, ఏషియన్ లక్ష్మీకళ, మియాపూర్ సాయిరంగా, ఎర్రగడ్డ గోకుల్ 70ఎంఎం వంటి ప్రముఖ సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. సైబరాబాద్‌లోని పీవీఆర్ ఇనార్బిట్ మాల్‌లో నైట్ షో హౌస్‌ఫుల్ కాగా, గచ్చిబౌలి ఏఎంబీ సినిమాస్, కోకాపేట్ అల్లు సినిమాస్, బంజారాహిల్స్ జీవీకే వన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇనాక్స్ ఓడియన్ సహా నగర నలుమూలలా ఉన్న స్క్రీన్లు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లోకి వెళ్లాయి.
రాజధాని నగరంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. వరంగల్‌లోని పీవీఆర్ మ్యాడాక్స్ మాల్, ఏషియన్ శ్రీదేవి మల్టీప్లెక్స్‌లతో పాటు కరీంనగర్‌లోని మమత థియేటర్‌లోనూ నైట్ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ అయ్యాయి. వారాంతం మొదలవుతున్న సమయంలో నైట్ షోల ట్రెండ్ జోరందుకోవడం బాక్సాఫీస్ వద్ద సినిమాకు కలిసివచ్చే అంశం.


