ఒకడు హారర్ అంటాడు.. ఇంకోడు ఏదో అంటాడు.. అసలు విషయం చెప్పేస్తున్న మాస్ మహారాజా.. ఎప్పుడంటే..?

ఒకడు హారర్ అంటాడు.. ఇంకోడు ఏదో అంటాడు.. అసలు విషయం చెప్పేస్తున్న మాస్ మహారాజా.. ఎప్పుడంటే..?

Published on Oct 9, 2026 7:00 PM IST

మాస్ మహారాజా రవితేజ తన 78వ సినిమా కోసం టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఒక హారర్ సబ్జెక్ట్ ఆధారంగా తెరకెక్కనుందని సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేశాయి. అయితే, ఈ రూమర్లకు చెక్ పెడుతూ మేకర్స్ సరదాగా ఒక కీలక ప్రకటన చేశారు. “ఒకడు హారర్ సినిమా అంటాడు… ఇంకొకడు ఏదో అంటాడు… ఇంకోడు వచ్చి ఇంకేదో అంటాడు” అంటూ ప్రచారంలో ఉన్న వార్తలను సెటైరిక్‌గా ప్రస్తావిస్తూ, ఈ సినిమా టైటిల్‌ను అక్టోబర్ 11న ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక వీడియో ద్వారా రివీల్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి విలన్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం. వివేక్ ఆత్రేయ మార్క్ కథనంతో రవితేజ చేయబోయే ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు