‘జైలర్ 2’ చిత్రానికి ఏపీ ప్రభుత్వం బూస్ట్.. టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్..!

‘జైలర్ 2’ చిత్రానికి ఏపీ ప్రభుత్వం బూస్ట్.. టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్..!

Published on Oct 9, 2026 9:01 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ క్రేజీ సీక్వెల్ చిత్రం ‘జైలర్-2’ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం తాజాగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది.

ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలైన రోజు (అక్టోబర్ 15) నుంచి అక్టోబర్ 21 వరకు మొత్తం 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ. 50 చొప్పున.. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.75 చొప్పున పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఈ నిర్ణయంతో ‘జైలర్-2’ చిత్రానికి మొదటి వారంలో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం లభించినట్లయింది. ఇక ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు