ఐకానిక్ టాక్ షోలో సందడి చేయబోతున్న అల్లు అర్జున్..?

ఐకానిక్ టాక్ షోలో సందడి చేయబోతున్న అల్లు అర్జున్..?

Published on Oct 1, 2026 10:55 PM IST

Allu-Arjun

ఇండియాలో అత్యంత పాపులారిటీ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షోలలో ‘కాఫీ విత్ కరణ్’ టాప్ ప్లే్స్‌లో నిలుస్తుంది. బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకాదరణ పొందుతూ ఐకానిక్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఈ షోలో బాలీవుడ్ స్టార్లతో పాటు టాలీవుడ్ నుంచి ప్రభాస్, రాజమౌళి, రానా, సమంత, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు పాల్గొని అలరించారు.

అయితే, ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిన ఈ టాక్ షోకు ముగింపు పలకబోతున్నట్లు కరణ్ జోహార్ ఒక ఎమోషనల్ వీడియో ద్వారా వెల్లడించారు. 8 సీజన్ల పాటు 161 ఎపిసోడ్లతో విజయవంతంగా సాగిన ‘కాఫీ విత్ కరణ్’, ఇప్పుడు రాబోయే 9వ సీజన్‌తో ముగియనుంది. ఈ నెల 14 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా ప్రసారం కానున్న ఈ చివరి సీజన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముగింపు సీజన్ కావడంతో ఈసారి గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా ఈ సీజన్‌లో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ ఈ ఐకానిక్ షోలో ఎలాంటి సందడి చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు