మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఇరుముడి తో భారీ హిట్ ని తను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీనితో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ లైనప్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇలా తన లిస్ట్ లో ఉన్న యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా ఉన్నాడు.
అయితే తాను ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ ని మాస్ మహరాజ్ తో ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాకి ఓ ఆసక్తికరమైన టైటిల్ ని లాక్ చేసినట్టు తెలుస్తోంది. మేకర్స్ ‘తులా భారం’ అనే టైటిల్ ని ఈ హారర్ ఎంటర్టైనర్ కి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ వివేక్ స్క్రిప్ట్ వర్కుని పూర్తి చేయగా అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దాదాపు దసరాకే సినిమా ఆరంభం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


