మొత్తానికి మళ్లీ సెట్స్ లోకి అడుగు పెట్టిన ‘దాదా’?

మొత్తానికి మళ్లీ సెట్స్ లోకి అడుగు పెట్టిన ‘దాదా’?

Published on Oct 1, 2026 6:00 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్లో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సినిమా దాదా కోసం అందరికీ తెలిసిందే. వీర సింహా రెడ్డి తర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నారు. దీనితో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కూడా బాలయ్య మార్క్ స్పీడ్ లోనే పూర్తి కావాల్సి ఉంది కానీ మధ్యలో బాలయ్యకి జరిగిన గాయంతో ఆలస్యం అయ్యింది.

అక్కడ నుంచి కొన్ని వారాల పాటు విశ్రాంతి లోనే ఉన్న బాలయ్య ఫైనల్ గా దాదా సెట్స్ లోకి అడుగు పెట్టినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. దాదాపు సినిమాని బాలయ్య తన పోర్షన్ ని పూర్తి చేయవచ్చారు. సో మిగతా పోర్షన్ కూడా పూర్తి చేయడానికి ఎంతో సమయం లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు