టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుమంత్ హీరోగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన పలు ఇంట్రెస్టింగ్ సినిమాల్లో లేటెస్ట్ గా వచ్చిన డివోషనల్ థ్రిల్లర్ సినిమా ‘మహేంద్రగిరి వారాహి’ కూడా ఒకటి. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రముఖ నటులు ఐశ్వర్య రాజేష్ అలాగే టిల్లు నటుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా నటించారు.
థియేటర్స్ లో మంచి రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా రేపు అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి రానున్నట్లు కన్ఫర్మ్ చేసారు. సో ఈ సినిమా చూడాలి అనుకుంటే రేపటి నుంచి అందులో చూడొచ్చు. పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రానున్న ఈ సినిమాని బ్రిడ్జ్ ఫిలిమ్స్, రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.


