టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు కాస్త ఉపశమనం కలిగించే వార్తతో ముందుకు వస్తోంది.
సాధారణంగా పెద్ద సినిమాల విడుదలకు భారీ టికెట్ ధరల పెంపుతో పాటు ప్రిమియర్ షోల హడావుడి ఉంటుంది. కానీ ఈ చిత్రం పెంచిన టికెట్ ధరలు, పెయిడ్ ప్రిమియర్ షోలు లేకుండానే అక్టోబర్ 9న థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. దసరా పండుగ సీజన్లో కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. అక్టోబర్ 9న బాక్సాఫీస్ వద్ద ఇతర ఏ పెద్ద తెలుగు సినిమా లేకపోవడం ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి మంచి కలిసివచ్చే అంశం.
మొదట అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించినప్పటికీ, పండుగ సెలవులకు మరింత దగ్గరగా ఉండేలా అక్టోబర్ 9కి వాయిదా వేశారు. సాధారణ టికెట్ ధరలతో నేరుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తే, దసరా సెలవులను పూర్తిగా సద్వినియోగం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.


