సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేస్తున్న భారీ సినిమానే జైలర్ 2. పార్ట్ వన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక దీంతో సీక్వెల్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే మేకర్స్ అంతకు మించిన గ్రాండ్ ప్లానింగ్ లతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఎట్టకేలకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కి అందం కాబోతున్న ఈ సినిమా పై మరో బిగ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు.
ఈ చిత్రాన్ని పాపులర్ సినిమా ఫార్మాట్ ఐమాక్స్ వెర్షన్ లో కూడా విడుదల చేస్తున్నట్టుగా తాజాగా ప్రకటించారు. సో థియేటర్స్ లో జైలర్ 2 ఎక్స్పీరియన్స్ మరింత గ్రాండ్ గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు. అనేకమంది పాపులర్ నటీనటులు నటించిన సినిమా ఈ అక్టోబర్ 15న సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.
#Jailer2 is coming to take over IMAX screens worldwide from Oct 15th! 🔥🌟 @IMAX@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vidya_balan @iam_SJSuryah #SurajVenjaramoodu @meramyakrishnan @iYogiBabu @mirnaaofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani… pic.twitter.com/tvI1i37clK
— Sun Pictures (@sunpictures) October 1, 2026


