100 మిలియన్లను దాటిన ‘దువ్వాడ జగన్నాథం’ !

అల్లు అర్జున్ చిత్రాలకు హిందీలో డిమాండ్ తెగ పెరిగిపోతోంది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన ‘సరైనోడు’ చిత్రం యొక్క హిందీ అనువాదం యూట్యూబ్ మాధ్యమంలో 171 రోజుల్లో 100 మిలియన్ల వ్యూస్ దాటి సరికొత్త రికార్డ్ సృష్టించగా ఆయన చివరి చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ హిందీ వెర్షన్ సైతం 100 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కేవలం 71 రోజుల్లో 100 మిలియన్లను టచ్ చేయడం విశేషం. దీంతో ఈ సినిమాలను యూట్యూబ్ లో రిలీజ్ చేసిన గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్ ఛానెల్ మంచి లాభాల్ని చవిచూసింది. ఈ రికార్డులతో బన్నీ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైపోయింది. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న ‘నా పేరు సూర్య’ ముగింపు దశకు చేరుకుంది.