‘1971’ పాటల చిత్రీకరణలో అల్లు శిరీష్ !
Published on Jan 19, 2017 4:47 pm IST

allu-sirish-1971
‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘1971 బియాండ్ బోర్డర్స్’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మేజర్ రవి 1971 కాలంలో భారత్, పాక్ ల మధ్య నెలకొన్న యుద్ధ నైపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం శిరీష్ పొలాచ్చిలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్లో శిరీష్ పై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. 1971 కాలంలో ఉండే వాతావరణానికి దగ్గర ఉండేలా షూట్ చేస్తున్న ఈ పాటలో శిరీష్ సాంప్రదాయకమైన పంచెకట్టుతో హుందాగా కనిపిస్తున్నాడు. రెడ్ రోజ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎక్కువ భాగం పంజాబ్, కాశ్మీర్, రాజస్థాన్ యుగాండా లలో చిత్రీకరించబడింది.

 
Like us on Facebook