వైరల్ : తన గ్యాలరీ లో స్పెషల్ పిక్ షేర్ చేసిన స్నేహా రెడ్డి

Published on Jul 23, 2022 1:30 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి ఆఫ్రికాకి హాలిడే వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. తనకు సినిమాల షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఆయన ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇటీవల పుష్ప మూవీ తో అతి పెద్ద సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, త్వరలో దానికి కొనసాగింపుగా రూపొందనున్న పుష్ప 2 షూట్ లో పాల్గొననున్న విషయం తెలిసిందే. మరోవైపు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మధ్యలో ఫ్యామిలీకి సంబందించిన విషయాలు షేర్ చేస్తుంటారు అల్లు అర్జున్.

అలానే ఆయన భార్య స్నేహా రెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. అయితే లేటెస్ట్ ఆస్క్ స్నేహారెడ్డి పేరుతో తన ఇన్స్టాగ్రామ్ లో పలువురు ప్రేక్షకాభిమానులు అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికి ప్రత్యేకంగా సమాధానాలిచ్చారు స్నేహారెడ్డి. అందులో భాగంగా మీ ఫోన్ గ్యాలరీలో మీకు ఇష్టమైన పిక్ ఏంటి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా, భర్త అల్లు అర్జున్, కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో కలిసి ఇటీవల దిగిన క్యూట్ ఫ్యామిలి పిక్ ని షేర్ చేసారు స్నేహారెడ్డి. అలానే తాము ప్రస్తుతం హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నాం అని, ఫ్యామిలీ లైఫ్ ఎంతో ఆనందంగా కొనసాగుతోందని ఆమె అన్నారు.

సంబంధిత సమాచారం :