సెట్స్ లో గాయపడిన అమితాబ్ ?
Published on Mar 13, 2018 12:32 pm IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం అమీర్ ఖాన్ తో కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్ లోని జోధ్ పూర్లో జరుగుతోంది. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు అమితాబ్ షూటింగ్ స్పాట్లో గాయపడ్డారని తెలుస్తోంది. దీంతో ముంబై నుండి డాక్టర్ల బృందం జోధ్ పూర్ బయలుదేరారు.

ఇక ఈ వార్తలకు బలం చేకూర్చేలా అమితాబ్ తన బ్లాగ్ స్పాట్లో షూటింగ్ విశేషాలతో పాటు రేపు ఉదయం తాను తన డాక్టర్ల బృందాన్ని కలవనున్నానని, వాళ్ళు తనను తిరిగి మాములుగా చేస్తారని, ఎప్పటికప్పుడు దీనిపై అప్డేట్స్ ఇస్తుంటానని పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానుల్లో అమితాబ్ కు ఏమైందోననే ఆందోళన మొదలైంది.

 
Like us on Facebook