లేటెస్ట్..”లైగర్” నుంచి ఇంపార్టెంట్, సాలిడ్ అప్డేట్ అట.!

Published on Mar 26, 2022 9:34 pm IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “లైగర్”. పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని ఆల్ మోస్ట్ పూరి జగన్నాథ్ ఫినిష్ చేసేసారు.

మరి టైం చూసి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మేకర్స్ లేటెస్ట్ గా ఇంకో ఇంపార్టెంట్ మరియు సాలిడ్ అప్డేట్ ని అందిస్తునట్టు కన్ఫర్మ్ చేశారు. అందరి అడ్రనలిన్ ని రైజ్ చేసే ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ ని అయితే రివీల్ చేయబోతున్నామని టీజ్ చేస్తున్నారు.

మరి ఆ అప్డేట్ ఏంటో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా మేకర్స్ ఈ సినిమాని రానున్న ఆగష్టు 25న రిలీజ్ చెయ్యబోతున్నారు.

సంబంధిత సమాచారం :