ఆ స్టార్ డైరెక్టర్ సంక్రాంతి హ్యాట్రిక్ హిట్ పై కన్నేశాడట..!

Published on Apr 6, 2020 1:02 pm IST

డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు విడుదల చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్టన్స్ సాధించిన ఈ చిత్రం టాలీవుడ్ టాప్ గ్రాస్ సాధించిన చిత్రాలలో ఒకటిగా ఉంది. ఇక బుల్లితెరపై కూడా ఈ మూవీ 23.4 టీఆర్పీ రేటింగ్ దక్కించుకొని ఆల్ టైం టాప్ లో నిలిచింది. వరుసగా 2019, 2020 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక వేగంగా సినిమాలు తీయడంలో అనిల్ ముందుంటారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీని ఆయన 6నెలల్లో పూర్తి చేసి ఔరా అనిపించారు.

ఈ మధ్య కాలంలో అతి తక్కువ సమయంలో మహేష్ పూర్తి చేసిన సినిమాలలో సరిలేరు నీకెవ్వరు ఒకటి. కాగా అనిల్ రావిపూడి 2021 సంక్రాంతి పై కూడా కన్నేశాడు. ఆయన ఎఫ్2 కి సీక్వెల్ గా ఎఫ్3 కి స్క్రిప్ట్ సిద్ధం చేస్తుండగా అది కూడా చివరి దశకు చేరినట్లు తెలుస్తుంది. దీనితో లాక్ డౌన్ పూర్తయిన తరువాత వీలైనంత త్వరగా ఈ మూవీ పట్టాలెక్కించాలని అతను ప్రయత్నిస్తున్నాడు. ఇక ఇందులో మళ్ళీ వెంకటేష్ నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ స్పష్టత లేదు. అన్నీ కుదిరితే మళ్ళీ అనిల్ రావిపూడి సంక్రాంతికి సందడి చేయడం ఖాయం.

సంబంధిత సమాచారం :

X
More