సాయిధరమ్ తేజ్ గురించి ఊహాగానాలకు తెరదించిన దర్శకుడు!
Published on Oct 14, 2017 6:47 pm IST

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో స్పెషల్ రోల్ లో మెరవనునట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూ లో స్పదించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ చిత్రంలో ఎవరూ స్పెషల్ రోల్ చేయలేదని దర్శకుడు తేల్చేశాడు. సాయిధరమ్ తేజ్ సూపర్ హిట్ చిత్రం సుప్రీం కు అనిల్ రావిపూడి దర్శకుడనే విషయం తెలిసిందే.

 
Like us on Facebook