‘కిరాక్ పార్టీ’ అందరికీ పాత రోజుల్ని గుర్తుచేస్తుందట !

యంగ్ హీరో నిఖిల్ చేస్తున్న తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ వారమే విడుదలవాల్సి ఉండగా పెండింగ్ పనుల వలన కొద్దిగా వెనక్కు వెళ్ళింది. కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శంకర్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేస్తున్నారు.

ఫైనల్ ఔట్ ఫుట్ చూసిన ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చిందని, చిత్రం ప్రతి ఒక్కరికి వాళ్ళ పాత జ్ఞాపకాల్ని గుర్తుచేస్తుందని అన్నారు. అంతేగాక సినిమా యొక్క విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కూడా అన్నారు. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించిన చిత్రానికి చందూ మొండేటి డైలాగ్స్ రాయగా కన్నడ నటి సంయుక్త హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటించింది.