ఓటిటిలో “అనిమల్” కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్.!

ఓటిటిలో “అనిమల్” కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్.!

Published on Feb 1, 2024 2:01 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ చిత్రం “అనిమల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం కాంట్రవర్సీల తోనే భారీ వసూళ్లు అందుకొని రీసెంట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే ఓటిటిలో వచ్చిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండగా ఈ వచ్చిన 3 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ ని అందుకున్నట్టుగా తెలిసింది.

అయితే కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం 20.8 మిలియన్ స్ట్రీమింగ్ హావర్స్ ని నెట్ ఫ్లిక్స్ లో క్రాస్ చేయగా ఇప్పుడు నాలుగు రోజుల్లో అయితే 150 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని 25 మిలియన్ మేర స్ట్రీమింగ్ హావర్స్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఇండియన్ సినిమా నుంచి మరో ఫాస్టెస్ట్ రికార్డుని అనిమల్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఓటిటి లో అనిమల్ వ్యూవర్ షిప్ బాగానే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు