సూపర్ స్టార్ సినిమాకు అనిరుద్ సంగీతం !
Published on Mar 1, 2018 6:04 pm IST

పిజ్జా, జిగిరితండా, ఇరువై వంటి విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవిధ్య‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ రజినికాంత్ ను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. రజినీకాంత్ అభిమానుల అంచనాలకు తగ్గకుండా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోందీ చిత్రం. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. అనిరుద్ రజినికాంత్ కు సంగీతం అందిస్తుడడం ఇదే మొదటిసారి. రజినికాంత్ నటించిన కాలా సినిమా టీజర్ రేపు విడుదల కాబోతోంది. సినిమా ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. రోబో 2 ఏప్రిల్ లో రావాలి కాని సినిమా వర్క్ పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది.

 
Like us on Facebook