ఓటిటి లో కూడా సూపర్ రెస్పాన్స్ తో “ప్రేమలు”

ఓటిటి లో కూడా సూపర్ రెస్పాన్స్ తో “ప్రేమలు”

Published on May 6, 2024 4:57 PM IST


చిన్న మూవీ గా రిలీజై, మలయాళం లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ప్రేమలు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 135 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది. నస్లెన్ కె గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన పాత్రల్లో, గిరీష్ ఎడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగులో విడుదలై, ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12, 2024 న ఆహా వీడియోలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం కి ఆహా వీడియో లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ 125 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ చిత్రంలో శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ లు కీలక పాత్రల్లో నటించగా, విష్ణు విజయ్ సంగీతం అందించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు