మూడో రోజు పెరిగిన “ఆ ఒక్కటీ అడక్కు” వసూళ్లు!

మూడో రోజు పెరిగిన “ఆ ఒక్కటీ అడక్కు” వసూళ్లు!

Published on May 6, 2024 5:56 PM IST

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటీ అడక్కు థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా, స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేసిన కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ముందునుండే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. సినిమా మొదటి రెండు రోజుల కంటే ఆదివారం నాడు కాస్త ఎక్కువ వసూళ్లను సాధించింది.

మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 5.14 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇది డీసెంట్ రెస్పాన్స్ అనే చెప్పాలి. జామీ లీవర్, కల్పలత, హరి తేజ, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు