మిస్టర్ బాక్సాఫీస్ లిస్ట్ లో ఇంకో బిగ్ డైరెక్టర్ పేరు కన్ఫర్మ్.!?

Published on Nov 25, 2021 11:00 pm IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్ స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ మార్కెట్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో ఫ్యూచర్ లో గట్టిగా వినిపించే పేరులా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా నిలిచేలా ఉంది. ఆల్రెడీ చరణ్ “RRR” తో మంచి గ్రిప్ అన్ని సినీ వర్గాల్లో తెచ్చుకున్నాడు.

ఇక దీని తర్వాత విజనరీ డైరెక్టర్ శంకర్ తో ఇంకో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అంచనాలు మరింత మెరుగుపరిచాడు. ఇలా తన లైనప్ లో ఒక్కో ఇంట్రెస్టింగ్ దర్శకుని పేరు చేరుస్తూ ఆసక్తి రేపుతున్న మిస్టర్ బాక్సాఫీస్ ఇప్పుడు కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది.

వీరి కాంబో కోసం ఎప్పుడు నుంచో బజ్ ఉంది అలాగే బడా బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని కూడా టాక్ ఉంది. మరి ఇవన్నీ నిజమే అన్నట్టు బాలీవుడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More