మహేష్, త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్..!

Published on May 25, 2021 9:06 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”.దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అనంతరం మాంత్రికుడు త్రివిక్రమ్ తో హాటిక్ చిత్రాన్ని అనౌన్స్ చెయ్యడంతో దానిపై మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించే గత కొన్ని రోజుల నుంచి పలు ఆసక్తికర వార్తలే వినిపిస్తున్నాయి.

మరి అలా లేటెస్ట్ గా మరో క్రేజీ బజ్ ఈ హ్యాట్రిక్ కాంబోపై వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ లేదు కానీ ఓ టాక్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంత మేర కాలమే నిర్ణయించాలి. అలాగే ఏఈ చిత్రాన్ని హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :