న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ నైజాంలో ఫర్వాలేదనిపిస్తున్నా, ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో సోమవారం నుంచి వసూళ్లు బాగా తగ్గిపోయాయి. మొదటి మూడు రోజుల్లో ఊపు చూపించినా, ప్రస్తుతం ప్రధాన సెంటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడం డిస్ట్రిబ్యూటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ శుక్రవారం గాంధీ జయంతి జాతీయ సెలవుదినం కావడం ఈ సినిమాకు పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది.
ఈ సెలవును వాడుకోవడానికి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘సిగ్మా’ వంటి నాలుగైదు చిన్న సినిమాలు పోటీ పడుతున్నప్పటికీ, పెద్ద సినిమాగా ‘ప్యారడైజ్’కే ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే నాని పబ్లిసిటీ తగ్గించకుండా స్వయంగా గుంటూరు, విజయవాడ థియేటర్లను విజిట్ చేస్తూ కలెక్షన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ స్పెషల్ వీకెండ్‌తో ఎంతవరకు రికవరీ సాధిస్తారో చూడాలి.


