వైరల్: ‘ప్యారడైజ్’ నటుడికి హరీష్ రావు సత్కారం.. మేకర్స్ కి తన శుభాకాంక్షలు!

వైరల్: ‘ప్యారడైజ్’ నటుడికి హరీష్ రావు సత్కారం.. మేకర్స్ కి తన శుభాకాంక్షలు!

Published on Sep 30, 2026 2:02 PM IST

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన సినిమానే ది ప్యారడైజ్. నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కనిపించిన పలు సర్ప్రైజ్ లలో యంగ్ హీరో ప్రియదర్శి పోషించిన శంకరన్న రోల్ కూడా ఒకటి.

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రతిభింబించేలా ప్రియదర్శి చేసిన సాలిడ్ పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు దక్కాయి. ముఖ్యంగా తెలంగాణ ఆడియెన్స్ మరింత కనెక్ట్ అయ్యారు. ఇక తన పెర్ఫామెన్స్ కి ముగ్దులైన ప్రముఖ రాజకీయ నాయకుడు హరీష్ రావు ప్రియదర్శీని ప్రత్యేకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు.

బలగం, మల్లేశం సినిమా నుంచి ఇప్పుడు ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ లా ఎమ్మెల్యే శంకరన్నగా ఒక అద్భుతమైన నటన చూపించే విధంగా తను ఎదగడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని తదితరులు అందరికీ శుభాకాంక్షలు తెలిపి దర్శి మరిన్ని గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనితో తన పోస్ట్, వీడియో ఇప్పుడు వైరల్ గా మారాయి.

తాజా వార్తలు