ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇంకోపక్క గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా గ్లోబల్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు తను చేస్తున్న వారణాసి సినిమా తర్వాత ఏ సినిమా చేయనున్నారు అనే డిస్కషన్ ఆల్రెడీ మొదలైంది. అయితే రాజమౌళి లైనప్ లో బాహుబలి 3, RRR 2 వంటివి ఆల్రెడీ ఉన్నాయి.
కానీ లేటెస్ట్ గా ఓ బిగ్ బజ్ వైరల్ గా వినిపిస్తోంది. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే ఓ వైబ్రేషన్ ఉంటుంది. గతంలో RRR ఓ మల్టీస్టారర్ గా వచ్చింది. అలాగే దీనికి సీక్వెల్ లో నటించడం కాకుండా తారక్ తో సోలోగా మరోసారి జక్కన్న సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు క్రేజీ రూమర్స్ మొదలయ్యాయి. దీనితో ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది వేచి చూడక తప్పదు.


