డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ : ఫస్ట్ రివ్యూ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. అదిరిపోయిందట..!

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ : ఫస్ట్ రివ్యూ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. అదిరిపోయిందట..!

Published on Sep 30, 2026 7:02 PM IST

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. శశాంక్ ఏలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు మరో బూస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూపంలో అందింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేష్ బాబు ఈ మూవీపై తన రెస్పాన్స్ తెలియజేశాడు.

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఒక అద్భుతమైన చిత్రమని.. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బలమైన ఎమోషన్ ఉందని.. ఇది అందరి హృదయాలను తాకుతుందని మహేష్ తెలిపాడు. ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో నటించిన తీరు, ఆయన తనను తాను మలిచిన తీరుకు అత్యద్భుతమని.. చిన్నారి సారా తన చక్కటి పర్ఫార్మె్న్స్‌తో ఆకట్టుకుందని ఆయన అన్నాడు. కార్తికేయకు ఇంతకంటే బెటర్ స్టార్ట్ ఉండదని.. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం స్క్రీన్ పై కనిపిస్తుందని.. దర్శకుడు శశాంక్ ఈ సినిమాను రూపొందించిన తీరు బాగుందని మహేష్ ఈ సినిమాపై తన రివ్యూని తెలియజేశాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు