ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు రాబోతున్న అవైటెడ్ సినిమాల్లో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మొదటి తెలుగు సినిమా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ కూడా ఒకటి. దర్శకుడు శశాంక్ యేలేటి తెరకెక్కించిన ఈ మ్యాజికల్ ఎంటర్టైనర్ సాలిడ్ ప్రమోషన్స్ తో రాబోతుంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ్ టీం ఈ సినిమాని ఎలా జనం లోకి తీసుకెళ్ళాలో అలా తీసుకెళ్తున్నారు.
ఇక ఫైనల్ టచ్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని కూడా దింపి మరింత బజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు. సో ఈ మ్యాజికల్ డ్రామా సందడి చేసేందుకు మొత్తం సిద్ధం అని చెప్పొచ్చు. ఇక థియేటర్స్ లోకి వచ్చాక సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించగా ఈ గాంధీ జయంతి హాలిడే సందర్భంగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
A magical experience made to bring out the child inside everyone 🤗✨#DontTroubleTheTrouble Certified U/A 🪄🤩
Grand Release Worldwide on October 2nd 💥#DTTTMovie #DTTTonOct2nd #FahadhFaasil #SsaraPalekar pic.twitter.com/XzOw2ngJ1w
— Arka Mediaworks (@arkamediaworks) September 30, 2026


