బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో సుహాస్ కోలీవుడ్ డెబ్యూ!

బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో సుహాస్ కోలీవుడ్ డెబ్యూ!

Published on Sep 30, 2026 1:02 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ విలన్ గా తమిళ స్టార్ కమెడియన్ నటుడు టర్న్డ్ హీరో సూరి హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రమే ‘మండాడి’. దర్శకుడు మతిమారన్ పుగలేంది తెరకెక్కించిన సముద్రపు బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా సాలిడ్ హిట్ అయ్యింది. అయితే సుహాస్ కి మంచి డెబ్యూగా అక్కడ నిలిచిన ఈ సినిమా భారీ వసూళ్లు అందుకుంటుంది.

గత కొన్ని వారాల కితం తెలుగు, తమిళ్ లో విడుదలైన సినిమా తెలుగులో మొదటి కొన్ని రోజులు పర్వాలేదు అనిపించింది కానీ తమిళ్ లో మాత్రం మాసివ్ వసూళ్లు రాబడుతూ సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తుంది. ఇక ఇలా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ సినిమా రాబట్టినట్టు మేకర్స్ చెబుతున్నారు. నిజానికి ఓ సినిమా అయినప్పటికీ ఈ రేంజ్ వసూళ్లు ఈ సినిమా సాధించింది అంటే పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందించారు. అలాగే ఎల్రెడ్ కుమార్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు