రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో సినిమాపై అవగాహన పెంచేందుకు చిత్ర బృందం నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ తరహా సిరీస్‌ను రూపొందించింది. మొదటి ఎపిసోడ్‌లో బ్రిటీషర్లు మద్రాస్ ప్రెసిడెన్సీలో ధాన్యాన్ని దోచుకోవడం వల్ల సంభవించిన కృత్రిమ కరువు, దానివల్ల కోటి మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడం గురించిన కథాంశాన్ని వివరించారు. అంతేకాకుండా ఇది కేవలం సాధారణ స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదని స్పష్టత ఇచ్చారు.
ఇక తాజాగా విడుదలైన రెండో ఎపిసోడ్‌లో విజయ్, రష్మికల ద్వారా మరొక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. బ్రిటీషర్లు భారతదేశంలో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కాదని, ఇక్కడి ధాన్యం, సుగంధ ద్రవ్యాలు, పత్తి మరియు బంగారాన్ని పోర్టులకు త్వరగా తరలించడానికేనని వివరించారు.
ఈ నిజాలను బ్రిటీషర్లే స్వయంగా చరిత్ర పుస్తకాలలో లేకుండా తొలగించారని విజయ్ అనగా, ఆనాటి ఘోరాల గురించి లోతుగా తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుందని రష్మిక పేర్కొన్నారు. విభిన్నమైన ప్రమోషన్లతో వస్తున్న ‘రణబాలి’ మూవీపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


