నాగచైతన్య సినిమాలో మరో హీరోయిన్ !
Published on Mar 8, 2018 11:28 am IST

నాగ చైతన్య, సమంత జంటగా ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణతో సినిమా చెయ్యబోతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతోంది. అయితే ఇప్పుడున్న హీరోయిన్స్ కాకుండా ఒక కొత్త అమ్మాయిని చిత్ర దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలో ఆ వివరాల్ని మీడియాతో పంచుకోబోతున్నారు సినిమా యూనిట్.

నాగ చైతన్య, సమంత జంటగా నటించబోతుండడంతో సినిమాకు మంచి క్రేజ్ లభించింది. ఈ సినిమాను సైని స్క్రీన్స్ సంస్థ నిర్మించబోతోన్న ఈ సినిమా మే నుండి ప్రారంభం కానుందని సమాచారం.

 
Like us on Facebook