విదేశాల్లో కరోనా.. ఎఫెక్ట్ అవుతున్న ‘రాధేశ్యామ్’

విదేశాల్లో కరోనా.. ఎఫెక్ట్ అవుతున్న ‘రాధేశ్యామ్’

Published on May 5, 2021 11:07 PM IST

ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రం ‘రాదేశ్యామ్’ ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. మొదటి లాక్ డౌన్ ముందు మొదలైన ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం కరోనానే. వైరస్ ప్రభావం పెరిగేకొద్ది సినిమా పనులు ఆలస్యమవుతూ వస్తున్నాయి. అందుకే పలుమార్లు సినిమా వాయిదాపడింది. లాక్ డౌన్ అనంతరం షూటింగ్ వేగవంతం చేసిన ప్రభాస్ టీమ్ అప్పుడప్పుడూ అప్డేట్స్ ఇస్తూ సినిమా అనుకున్న సమయానికే వస్తుందని హింట్స్ ఇస్తూ వచ్చింది. జూలై 30న విడుదల అనుకున్నారు.

కానీ ఇప్పుడు చూస్తే అది కూడ మారేలా ఉంది. ఎందుకంటే సినిమా పూర్తిగా 80 ల నేపథ్యంలో సాగేది కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పనుల్ని చిత్ర నిర్మాతలు పలు విదేశీ కంపెనీలకు అప్పగించారు. కానీ ఆయా కంపెనీలు ఉన్న దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ కంపెనీల ఉద్యోగులు సక్రమంగా వర్క్ చేయలేకపోతున్నారట. దీంతో అనుకున్న సమయానికి వర్క్ ఫినిష్ అవడం కష్టమని తెలుస్తోంది. దీనికితోడు ఇండియాలో సెకండ్ వేవ్ విజృంభణ మరీ ఎక్కువగా ఉండటంతో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే వాతావరణం కనిపించట్లేదు. ఈ కారణాల రీత్యా రిలీజ్ డేట్ జూలై 30 నుండి మరింత వెనక్కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు