మరో లెజెండ్ బయోపిక్ చిత్రానికి ముహూర్తం ఖరారు !
Published on Oct 24, 2017 1:30 pm IST


తమిళ సూప‌ర్ స్టార్, దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎంజీఆర్ జీవిత క‌థ ఆధారంగా ఒక మూవీ రానుంది. అదే ’ఎంజిఆర్ బయోపిక్’. ఎప్పటినుంచో ఈ సినిమా మొదలు కాబోతుందని వార్తలు వస్తునప్పటికీ ఇన్నాళ్లకు ఒక క్లారిటి వచ్చింది. రమణ కమ్యూనికేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ప్రముఖ దర్శకుడు బాలకృష్ణన్ ఈ బయోపిక్ ను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు.

ప్రస్తుతం ఎంజి రామ‌చంద్ర‌న్ పాత్రలో నటుడి కోసం అన్వేష‌ణ కొన‌సాగుతున్న‌ట్లు తతెలుస్తోంది. దీనిలో మొద‌టి వ‌రుస‌లో స‌త్య‌రాజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎంజిఆర్ పాత్ర‌కు స‌త్య‌రాజ్ స‌రిపోతాడ‌ని చిత్ర యూనిట్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సిఎం పళనిస్వామి ఈ చిత్ర ప్రారంభ ముహూర్తం క్లాప్ కొట్టనున్నారు. నవంబర్ 8 న ఈ చిత్రం పలు ఎం.ఎల్.ఏలు, మంత్రుల సమక్షలో ఆరంభం కానుంది.

 
Like us on Facebook