మిలియన్ డాలర్ ఖాతాను తెరవనున్న మొదటి నటి అనుష్క !

లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ‘భాగమతి’ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండంగా ఆడుతోంది. మొదటి రోజు 2.77 లక్షల డాలర్లను, రెండవ రోజుకు 5.19 లక్షల డాలర్లను అందుకున్న ఈ సినిమా ఆదివారం కూడా అదే స్థాయిలో రాణించి మూడు రోజులకు కలిపి 7 లక్షల డాలర్లను కొల్లగొట్టింది.

దీంతో చిత్ర ఇంకో మూడు రోజుల్లో మిలియన్ డాలర్ మార్కును అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇప్పటి వరకు కేవలం హీరోల పేర్ల మీద మాత్రమే ఉన్న మిలియన్ డాలర్ రికార్డును అందుకున్న తొలి తెలుగు హీరోయిన్ అనుష్కే కానుంది. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సైతం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.12 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.