‘అప్పట్లో ఒకడుండేవాడు’ కాంటెస్ట్ : ఈ విఠల్ సేట్ ఎవరు?
Published on Sep 28, 2016 10:37 pm IST

appatlo-okkadu
ఈ నెల్లోనే విడుదలైన ’జ్యో అచ్యుతానంద’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న మంచి హిట్ కొట్టేసిన నారా రోహిత్, తాజాగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే రియలిస్టిక్ సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పట్నుంచే సినిమాపై ఆసక్తి రేకెత్తించాలన్న ఉద్దేశంతో అప్పట్లో ఒకడుండేవాడు టీమ్ ఓ కాంటెస్ట్‌ను పట్టుకొచ్చింది.

హైద్రాబాద్‌లోని పాతబస్తీ నేపథ్యంలో జరిగే ఈ కథలో అన్నీ నిజ జీవిత పాత్రలే ఉండనున్నాయి. ఇక ఆయా పాత్రల్లో నటించిన నటుల పాత ఫోటోలను చూపిస్తూ, ఆ నటుడెవరో గుర్తు పట్టమంటూ టీమ్ ఈ కాంటెస్ట్ పెట్టింది. కాంటెస్ట్‌లో మొదటి ఫోటోగా ఈ కింది ఫోటోను విడుదల చేశారు. సినిమాలో విఠల్ సేట్ పాత్రలో నటించిన ఈ నటుడు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇక ఈ ఫోటోలో ఉన్న నటుడెవరో గుర్తుపట్టి కింద పేర్కొన్న నెంబర్ (7093909777)కు వాట్సాప్ చేయాల్సిందింగా టీమ్ కోరుతోంది. కాంటెస్ట్‌లో విజయం సాధించిన వారికి టీమ్ ప్రత్యేక బహుమతులు ఇస్తుందట. ‘అయ్యారే’ సినిమాతో మెప్పించిన దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నారా రోహిత్ ఇంతకుముందెన్నడూ కనిపించనంత కొత్తగా కనిపించనున్నారు.

 
Like us on Facebook