యూఎస్ బాక్సాఫీస్.. తొలిరోజే వ‌న్ మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరిన అర‌వింద‌..!

Published on Oct 12, 2018 3:27 pm IST

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. ద‌స‌రా కానుక‌గా గురువారం విడుద‌ల అయిన ఈ చిత్రం మొద‌టి షోనుండే హిట్ టాక్ సొంత చేసుకుంది. ఈ చిత్రంలో త్రివిక్ర‌మ్ త‌న మాట‌ల‌తో మ‌రోసారి మ్యాజిక్ చేశార‌ని, ఇక‌ ఎన్టీఆర్ న‌ట‌న అయితే పీక్స్‌లో ఉంద‌ని దీంతో తెలుగు బాక్స్‌ఫీస్ కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం తొలిరోజు క‌లెక్ష‌న్స్ $1M మార్కును చేరుకున్నాయిని తెలుస్తోంది. యూఎస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటిని ఎన్టీఆర్ ఆరో చిత్రం అర‌వింద‌.

ఇక అంతే కాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఎన్టీఆర్ చిత్రంగానూ అరవింద సమేత నిలవబోతోంది. యూఎస్ ప్రీమియ‌ర్స్‌లో ఎన్టీఆర్ గ‌త చిత్రాల రికార్డును తిర‌గ‌రాస్తూ అర‌వింద $797,366 క‌లెక్ష‌న్స్ సాధించింది. ఇక మొత్తం సాయంత్రం చివ‌రి ఆట ముగిసే స‌మ‌యానికి మొత్తం విడుద‌ల అయిన 187 సెంట‌ర్ల‌లో క‌లుపుకొని మ‌రో $207,870 క‌లెక్ష‌న్లు సాధించే అవ‌కాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రం వీకెండ్‌లో విడుద‌ల కాన‌ప్ప‌టికీ యూఎస్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింద‌ని.. ఈ వీకెండ్ ఆదివారం నాటికి అర‌వింద $2M క్ల‌బ్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

సంబంధిత సమాచారం :