యూఎస్ బాక్సాఫీస్ రికార్డ్స్ ను తిరగరాస్తున్న అరవింద సమేత !

Published on Oct 11, 2018 12:01 am IST

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అరవింద సమేత మరి కొద్దీ గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఇక ఈ చిత్రం అటు ప్రీమియర్ షోస్ ద్వారా యూఎస్ బాక్సాఫిస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. అక్కడి కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ చిత్రం అక్కడ 179 లొకేషనల్లో $459k వసూళ్లను రాబట్టింది.

ఇక ఈచిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే అక్కడ బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పనుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించింది. ఇక ఈచిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది. ఇప్పటికే అడ్వాన్ బుకింగ్ భారీ స్థాయిలో జరిగింది.

సంబంధిత సమాచారం :